‘గ్రేటర్‌’లో కుతుకులూరు ఆడపడుచు జయకేతనం

ABN , First Publish Date - 2020-12-06T05:50:31+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కుతుకులూరు ఆడపడుచు గుడిమెట్ల హేమలత జయకేతనం ఎగురు వేశారు.

‘గ్రేటర్‌’లో కుతుకులూరు ఆడపడుచు జయకేతనం

అనపర్తి, డిసెంబరు 5: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కుతుకులూరు ఆడపడుచు గుడిమెట్ల హేమలత జయకేతనం ఎగురు వేశారు. దీంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్‌లోని 130వ డివిజన్‌ (సుభాష్‌ నగర్‌) నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన హేమలత 12600 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వెదురుపాక సావరానికి చెందిన గుడిమెట్ల సురేష్‌రెడ్డిని పెళ్లాడిని ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సురేష్‌రెడ్డి 2010లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో సూరారంకాలనీ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 

Updated Date - 2020-12-06T05:50:31+05:30 IST