బైండోవర్ కేసు కోసం చితకబాదారు
ABN , First Publish Date - 2020-03-08T09:17:02+05:30 IST
ఎక్సైజ్ పోలీసులు బైండోవర్ కేసుకోసం తనను అన్యాయంగా కొట్టి చావబాదారంటూ ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి

కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు
ప్రత్తిపాడు, మార్చి 7: ఎక్సైజ్ పోలీసులు బైండోవర్ కేసుకోసం తనను అన్యాయంగా కొట్టి చావబాదారంటూ ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన గిడుతూరి లోవరాజు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా డు. మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది శనివారం గ్రా మానికి విచ్చేసిన లోవరాజు తనకు జరిగిన అన్యాయంపై స్థానిక విలేకర్ల వద్ద వాపోయారు. గతంలో 10 లీటర్ల సారాతో దొరకడంతో తనను ఎక్సైజ్ పోలీసులు రిమాండ్‌కు పంపారని చెప్పాడు.
దానిని అలుసుగా తీసుకుని బైండోవర్ కేసు పెడతామంటూ ప్రత్తిపాడు ఎక్సైజ్ సీఐ పి.వెంకటరమణ, మరో నలుగురు సిబ్బంది గత గురువారం తనను దుర్భాషలాడి చితకబాదారని లోవరాజు ఆరోపించారు. సీఐ కొట్టిన దెబ్బలు చూపుతూ లోవరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు జరిగిన అన్యాయంపై విచారించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై ఎక్సైజ్ సీఐ వెంకటరమణను వివరణ కోరగా లోవరాజును తాము కొట్టలేదని, తమనే తోసేశాడని చెప్పారు.