వెంకన్న ఆలయంలో భక్తజనం

ABN , First Publish Date - 2020-12-06T06:50:48+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజన సందడి నెలకొంది.

వెంకన్న ఆలయంలో భక్తజనం

స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.5.33లక్షలు

ఆత్రేయపురం, డిసెంబరు 5: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన 9,711 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవలద్వారా రూ.5,33,453 ఆదాయం లభించింది. గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గోక్షేత్రం వద్ద భక్తులు గోమాతలకు పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు ఏర్పాట్లు నిర్వహించారు.  Read more