వెంకన్న ఆలయంలో భక్తజనం

ABN , First Publish Date - 2020-12-27T06:55:12+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనసందడి నెలకొంది.

వెంకన్న ఆలయంలో భక్తజనం

ఒక్కరోజు ఆదాయం రూ.4.38 లక్షలు

ఆత్రేయపురం, డిసెంబరు 26: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం భక్తజనసందడి నెలకొంది. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే తలనీలాలు, కానుకలు, సమర్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 9,545మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవలద్వారా రూ.4,38,433 ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు  రావులపాడుకు చెందిన కడలి సాయిలక్ష్మి రూ.10,021, అవిడికి చెందిన లంకా సూర్యారావు రూ.10వేలు విరాళం అందించారు.


Updated Date - 2020-12-27T06:55:12+05:30 IST