జె స్టోర్ సేవలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2020-10-21T06:01:16+05:30 IST
జె స్టోర్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకుని పరిశోధకులుగా ఎదగాలని నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు సూచించారు. గ్రంథాలయ సేవలను అభివృద్ధి పరచడానికి ఇప్పటికే జె గేట్ ను కొనుగోలు చేశామని, తాజాగా జె స్టోర్ సేవలను అందిస్తున్నామని చెప్పారు.

నన్నయ వీసీ జగన్నాథరావు
దివానచెరువు, అక్టోబరు 20: జె స్టోర్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకుని పరిశోధకులుగా ఎదగాలని నన్నయ వీసీ మొక్కా జగన్నాథరావు సూచించారు. గ్రంథాలయ సేవలను అభివృద్ధి పరచడానికి ఇప్పటికే జె గేట్ ను కొనుగోలు చేశామని, తాజాగా జె స్టోర్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. నన్నయ విశ్వవిద్యాలయంలోని బీఆర్ అంబేడ్కర్ కేంద్ర గ్రంథాలయంలో జె స్టోర్ సేవలను మంగళవారం వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనలు, పరిశోధనా పత్రాలు, జర్నల్స్, ఆర్టికల్స్, ప్రచురణలు, పాఠ్యాంశాలు వంటి అన్ని అంశాలను జె స్టోర్ ద్వారా పొందవచ్చని చెప్పారు. దీనిలో 1,50,000కు పైగా ఆర్టికల్స్, ఐదు వేలకు పైగా జర్నల్స్ ఉంటాయని చెప్పారు. 59 పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారం జె స్టోర్ ద్వారా పొందవచ్చని వీసీ జగన్నాథరావు చెప్పారు. విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం క్యాంపస్‌తో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లకు చెందినవారు దీనిని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. నన్నయ రిజిసా్ట్రర్ ఆచార్య బట్టు గంగారావు, లైబ్రరీ కో ఆర్డినేటర్ కె.రమణేశ్వరి, ఈసీ మెంబర్లు కె.శ్రీరమేష్, బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు, డీన్స వై.శ్రీనివాసరావు, ఎ.మట్టారెడ్డి, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.