యూపీ సీఎం రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-10-08T06:44:13+05:30 IST

హాథ్రస్‌ సంఘటనకు ఉత్తరప్రదేశ్‌ సీఎం నైతికబాధ్యత వహించి రాజీనామా చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు...

యూపీ సీఎం రాజీనామా చేయాలి

తుని, అక్టోబరు 7: హాథ్రస్‌ సంఘటనకు ఉత్తరప్రదేశ్‌ సీఎం నైతికబాధ్యత వహించి రాజీనామా చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గొల్లఅప్పారావు సెంటర్‌లో హాథ్రస్‌ ఘటనకు నిరసనగా బుధవారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నాయకుడు కే.జనార్ధాన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినప్పటికీ, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే ఆ చట్టాలను అమలుచేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళిత మహిళలపై ఎన్ని హత్యాచారాలు జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కులను కాలరా స్తూ బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. కార్యక్రమంలో వాడబోయిన శివ, కే.అనూష్య, లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-08T06:44:13+05:30 IST