-
-
Home » Andhra Pradesh » East Godavari » UP CM should resign
-
‘యూపీ సీఎం రాజీనామా చేయాలి’
ABN , First Publish Date - 2020-10-07T10:03:41+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రా్‌సలో హత్యాచార సంఘటనకు నైతిక బాధ్యత వహించి ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు...

కూనవరం, అక్టోబరు 6: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రా్‌సలో హత్యాచార సంఘటనకు నైతిక బాధ్యత వహించి ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని మహిళా నాయకులు డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ కూనవరంలో సీపీఎం, సీపీఐ నాయకులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో సుధారాణి, శీలత, వెంటేశ్వరి, వినీత, భాను, భార్గవి, పెంటయ్య, నరేంద్ర, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం సిటీ: హాథ్రాస్ ఘటనను నిరసిస్తూ సిమెంట్రిపేటలో ఎమ్మార్పీస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీస్ నాయకుడు వైరాల అప్పారావు మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన నిందితులను ఉరి తీయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రధాని స్పందిచక పోవడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.