సామర్లకోటలో మరో ఇద్దరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-26T11:47:59+05:30 IST

సామర్లకోటలో మరో రెండు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఢిల్లీ కనెక్షన్‌ నేపథ్యంలోనే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ..

సామర్లకోటలో మరో ఇద్దరికి పాజిటివ్‌

కోలావారి వీధిలోనే రెండు కేసులు

 విజయవాడ నుంచి పెళ్లికి వచ్చి ఉండిపోయిన వారిద్దరికీ కరోనా


కాకినాడ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), ఏప్రిల్‌ 25 : సామర్లకోటలో మరో రెండు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఢిల్లీ కనెక్షన్‌ నేపథ్యంలోనే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఉన్న కోలావారి వీధిలోనే ఈ కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే వీటిని అధికా రికంగా ప్రకటించాల్సి ఉంది. ఒక వివాహం నిమి త్తం విజయవాడ నుంచి వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ ఉండిపోయిన పాజిటివ్‌ కేసు బంధువులైన ఒక మహిళ, మరొక యువకుడికి పాజిటివ్‌ వచ్చిన ట్టు సమాచారం. దీంతో అతడి కుటుంబ సభ్యులం దరినీ ఐసోలేషన్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. సామర్లకోటలో వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. అధికారులు కూడా అప్రమత్తమై ఇక్కడ చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇప్పటికే ఈ ప్రాంతం థిక్‌ రెడ్‌జోన్‌లో ఉంది.

Updated Date - 2020-04-26T11:47:59+05:30 IST