తుంగభద్ర పుష్కరాలకు తరలివెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-11-25T06:26:11+05:30 IST

తుంగభద్ర పుష్కరాలకు మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరినట్టు రావుపాలెం డిపో మేనేజరు అజితకుమారి తెలిపారు.

తుంగభద్ర పుష్కరాలకు తరలివెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు

రావులపాలెం రూరల్‌, నవంబరు 24: తుంగభద్ర పుష్కరాలకు మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరినట్టు రావుపాలెం డిపో మేనేజరు అజితకుమారి తెలిపారు. పుష్కరాల బస్సును మంగళవారం ఆమె కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. మంత్రాలయంతో పాటు అలంపూర్‌, జోగులాంబ ఆలయాల దర్శనాలను కూడా ప్యాకేజీలో కల్పించినట్టు తెలిపారు. శనివారం మరో బస్సు బయల్దేరుతుందన్నారు. వివరాలకు 99592 25537, 73828 11871 నెంబర్లను సంప్రదించాలని అజితకుమారి కోరారు.


Read more