కాకినాడలో ‘గుడికో గోమాత’: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2020-12-13T07:13:27+05:30 IST

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 12: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని కాకినాడలో శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శనివారం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ధర్మ ప్రచారపరిషత్‌, ఎస్వీ గోసంరక్షణ శాలల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ

కాకినాడలో ‘గుడికో గోమాత’: టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
కాకినాడ బాలాత్రిపురసుందరి ఆలయంలో గోమాత పూజ చేస్తున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైంకుఠ ద్వారదర్శనం పది రోజులు నిర్వహణ

కొత్తగా 500 ఆలయాల నిర్మాణానికి సన్నాహాలు


భానుగుడి (కాకినాడ), డిసెంబరు 12: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని కాకినాడలో శ్రీ బాలా త్రిపురసుందరి అమ్మవారి ఆలయంలో శనివారం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ధర్మ ప్రచారపరిషత్‌, ఎస్వీ గోసంరక్షణ శాలల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిగింది. తొలుత ఆవు, దూడ లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారి ఆలయానికి టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంప్రదాయాల్లో తల్లితో సమానంగా గోమాతను పూజిస్తారని, కార్తీకమాసంలో దేశవ్యాప్తంగా ఈ సంప్రదాయానికి ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం జగన్మో హన్‌రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బలహీనవర్గాలు, మత్య్పకారులు నివసించే ప్రాంతాల్లో కొత్తగా 500 ఆలయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంత్రులు పినిపే విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, సీహెచ్‌ వేణులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దొరబాబు, ఆలయ చైర్మన్‌ పెద్ది రత్నాజీ, ఈవో నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T07:13:27+05:30 IST