జిల్లాలోని 30 పీహెచ్‌సీల్లో ట్రూనాట్‌ కిట్లు

ABN , First Publish Date - 2020-06-19T10:13:36+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభి స్తున్న తరుణంలో 30 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో రోగనిర్ధారణకు ట్రూనాట్‌ పరీక్షలకు

జిల్లాలోని 30 పీహెచ్‌సీల్లో ట్రూనాట్‌ కిట్లు

కరోనా వైరస్‌ వ్యాప్తిపై నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి


అమలాపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభి స్తున్న తరుణంలో 30 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో రోగనిర్ధారణకు ట్రూనాట్‌ పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్టు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. వైరస్‌ మరింత వ్యాప్తి చెందు తున్నందున శుక్రవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. సెలూన్‌ షాపుల్లోను, కూరగాయలు, పండ్ల దుకాణాల వద్ద విక్రయదారు లు, ప్రజలు మాస్కులు ధరించడంలేదని, దీనివల్ల కరోనా వ్యాప్తి తీవ్రంగా ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.


రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులంతా పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని గురువారం అమలాపురం కిమ్స్‌ ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా కిమ్స్‌ కళాశాల మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక కోసం డెడికేటెడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు. ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ సిన్వర్‌, ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌, డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, కిమ్స్‌ ఆసుపత్రి వైస్‌చైర్మన్‌ మోహన్‌రాజ్‌, ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ ఏఎస్‌ కామేశ్వరరావు, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ పుష్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-19T10:13:36+05:30 IST