రెవెన్యూ అధికారుల బదిలీలు

ABN , First Publish Date - 2020-02-16T08:55:27+05:30 IST

జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ

రెవెన్యూ అధికారుల బదిలీలు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 15: జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఏవోగా పని చేస్తున్న డి.శ్రీదేవి పెద్దాపురం తహశీల్దార్‌గా నియమితులయ్యారు. పెద్దాపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న కె.పద్మావతి రామచంద్రాపురం ఏవోగా బదిలీ అయ్యారు. కూనవరం తహశీల్దార్‌ పీవీవీ గోపాలకృష్ణ, ప్రత్తిపాడు తహశీల్దార్‌గా నియమితులయ్యారు. ప్రత్తిపాడు తహశీల్దార్‌గా ఉన్న విద్యాసాగర్‌ను కాకినాడ రెవెన్యూ డివిజన్‌ ఏవోగా నియమితులయ్యారు. చింతూరు తహశీల్దార్‌గా కె.పోసిబాబు, గోకవరం తహశీల్దార్‌గా నియమితులయ్యారు.

Updated Date - 2020-02-16T08:55:27+05:30 IST