రైలు పట్టాలపై ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-11T06:05:16+05:30 IST
కడియం- కేశవరం రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 10: కడియం- కేశవరం రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు. కడియం రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం 11:40 గంటలకు సుమారు 45 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి రైలు పట్టాలపై చనిపోయి ఉన్నాడని, ఎరుపురంగు టీషర్టు, నీలం రంగు జీన్‌ప్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. జేబులో ఈనెల 9న జొన్నాడ నుంచి వేమగిరి వరకు తీసుకున్న ఆర్‌టీసీ బస్ టిక్కెట్ ఉందన్నారు. ఎస్‌ఐ పి.లోవరాజు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 9491444022, 0883- 2442821కు సమాచారం ఇవ్వాలని కోరారు.