ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-10-27T06:10:52+05:30 IST

జిల్లాలో కోనసీమ, మారేడుమిల్లి ప్రాంతాలలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేందుకు అసవరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్‌ సమావేశాన్ని జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు.

ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి

డె యిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 26: జిల్లాలో కోనసీమ, మారేడుమిల్లి ప్రాంతాలలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేందుకు అసవరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్‌ సమావేశాన్ని జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ వీసీలో జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, జి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నదీవ్యవస్థ, అడవులు, ఆఽధ్యాత్మిక క్షేత్రాలపరంగా జిల్లాకు గొప్ప విశిష్టత ఉందన్నారు. ఈ నేపఽథ్యంలో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలు ఉన్నాయని, ఈ విషయమై అధికారులు దృష్టి సారించాలన్నారు. పర్యాటక ప్రాజెక్టు పనులకు సంబంధించి అవసరమైన నిధులు కోసం ఏపీటీడీసీకి నివేదిక పంపించామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రాంతాలు ఉన్నాయన్నారు. కోనసీమ, మారేడుమిల్లి ప్రాంతాలలో ఎకో టూరిజం అభివృద్ధికి అవసరమైన 20 ఎకరాల భూమి సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. కోరంగి దగ్గర పర్యాటక శాఖ నిర్మించిన భవనాలను అటవీశాఖకు అప్పగించాలన్నారు. రాజమహేంద్రవరంలోని హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధిపై పర్యాటక శాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అమలాపురం దగ్గర పాసర్లపూడి, ఆదూరు ప్రాంతాలలో పర్యాటక శాఖకు చెందిన భవనాలు వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ ఆదిత్య, చింతూరు ఐటీడీఏ పీవో రమణ, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకుడు టి.రాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి పి.వెంకటాచలం, డీవీఎం టి.వీరనారాయణ, ఈఈ ఎంవీ రాజారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:10:52+05:30 IST