నేటి నుంచి పంటు రాక పోకలు

ABN , First Publish Date - 2020-12-27T07:01:43+05:30 IST

సఖినేటిపల్లి-నరసాపురం రేవులో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 8నెలలుగా నడవని పంటు రాకపోకలు ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతాయని ఎంపీడీవో గొల్లమందల వరప్రసాద్‌బాబు తెలిపారు.

నేటి నుంచి పంటు రాక పోకలు

అంతర్వేది, డిసెంబరు 26: సఖినేటిపల్లి-నరసాపురం రేవులో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 8నెలలుగా నడవని పంటు రాకపోకలు ఆదివారం నుంచి పునఃప్రారంభమవుతాయని ఎంపీడీవో గొల్లమందల వరప్రసాద్‌బాబు తెలిపారు. ఇటీవల జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం, పంటు యాజమాన్యాలు దిగివచ్చి రాకపోకలు కొనసాగించడానికి అంగీకరించారన్నారు.  ఆదివారం నుంచి పంటు రాకపోకలు సజావుగా జరుగుతాయన్నారు. 


Updated Date - 2020-12-27T07:01:43+05:30 IST