నేడు దంత వైద్యసేవలు బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T06:55:17+05:30 IST

ఆయుర్వేదంలో డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థులు వివిధ రకాల సాధారణ శస్త్ర చికిత్సలు చేసేలా ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ 2016 చేసిన సవరణలకు నిరసనగా శుక్రవారం దంత వైద్య సేవలు నిలుపుదల చేస్తున్నట్టు దంత వైద్యుల సంఘం నాయకులు అడ్డాల సత్యనారాయణ తెలిపారు.

నేడు దంత వైద్యసేవలు బంద్‌

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 10: ఆయుర్వేదంలో డిగ్రీ, పీజీ చేసిన విద్యార్థులు వివిధ రకాల సాధారణ శస్త్ర చికిత్సలు చేసేలా ఇండియన్‌ మెడిసిన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ 2016 చేసిన సవరణలకు నిరసనగా శుక్రవారం దంత వైద్య సేవలు నిలుపుదల చేస్తున్నట్టు దంత వైద్యుల సంఘం నాయకులు అడ్డాల సత్యనారాయణ తెలిపారు. నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని ఆస్పత్రిలో దంత వైద్యుల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్‌.. ఈఎన్‌టీ, హెడ్‌, డెంటల్‌ స్పెషలైజేషన్‌ కోర్సులను పీజీలో ప్రవేశపెట్టిందన్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం ఈఎన్‌టీ, దంత వైద్యం, కంటి శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా ఐఏసీసీ సవరణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్‌ గ్రాప్టింగ్‌, కంటి శుక్లం శస్త్రచికిత్స, రూట్‌కెనాల్‌ వంటి సాధారణ ఆపరేషన్లు చట్టబద్ధంగా నిర్వహించేందుకు అవ   కాశం కల్పించిందన్నారు. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) పాలక్య (చెవి,ముక్కు, గొంతు) విధానాలలో శిక్షణ ఇచ్చేవిధంగా ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దంత వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్లు వీవీ రావు, రఘరామ్‌, కృష్ణమోహన్‌, సువర్ణరాజు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T06:55:17+05:30 IST