టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి

ABN , First Publish Date - 2020-10-27T06:06:26+05:30 IST

టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని, లేకుంటే తామే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలనే అంశంపై సోమవారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి
రౌండు టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

  • -ప్రభుత్వం ఇవ్వలేకుంటే మేమే అప్పగిస్తాం 
  • -రౌండు టేబుల్‌ సమావేశంలో ప్రభుత్వానికి అఖిలపక్షనేతల అల్టిమేటం
  • -ముఖ్యఅతిథిగా పాల్గొన్న రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 26: టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని, లేకుంటే తామే వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఏపీ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలనే అంశంపై సోమవారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో రౌండు టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆపివేసిందన్నారు. కాంట్రాక్టర్ల నుంచి పది శాతం కమిషన్లు కావాలని గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని, లబ్ధిదారుల జాబితాను కూడా మార్చేశారని అన్నారు. ఎక్కడో నగరానికి దూ రంగా పేదలకు ఇళ్లు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో అధిక ధరకు స్థలాలు కొనుగో లు చేసి వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతికి తెరలేపారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణాల కోసం వామపక్షాలు ఎన్నో ఉద్య మాలు, పోరాటాలు చేశాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, మండపేట, అమలాపురం నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్లు నిర్మించారని, వీటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమాక్రసీ నాయకులు జోజి, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ఏవీ రమణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి వంగమూడి కొండలరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు సత్తిబాబు, బి.రాజులోవ, బొమ్మసాని రవిచంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:06:26+05:30 IST