నేటి నుంచి తిరుపతి లడ్డూల విక్రయం
ABN , First Publish Date - 2020-05-29T11:47:08+05:30 IST
కాకినాడ టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కల్యాణమండపం ..

కాకినాడ భానుగుడి మే 28: కాకినాడ టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నుంచి శ్రీవారి లడ్డూ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కల్యాణమండపం మేనేజర్ జె.వీరప్రతాప్ తెలిపారు. సుమారు 20 వేల లడ్డూలను ఆర్డర్ ఇచ్చామని భక్తులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఒక్కో లడ్డూ రూ.25 చొప్పున ఒకరికి పది లడ్డూల వరకు ఇస్తామన్నారు.