ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-06-04T11:01:06+05:30 IST

వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు.

ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష

ఆర్టీసీ ఆర్‌ఎం నాగేశ్వరరావు 


రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 3: వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో తొమ్మిది డిపోలు ఉండగా మూడుచోట్ల వీటిని పెట్టామన్నారు.


మిగిలిన డిపోల్లో ప్రయాణికుల ఇన్‌/అవుట్‌ మార్గాలు ఎక్కువ సంఖ్యలో ఉండ డంతో థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరికరాల ఏర్పాటు ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రతీ ప్రయాణికుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి వీలుగా బస్‌ కాంప్లెక్స్‌ల వద్ద హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆర్‌ఎం వెల్లడించారు. ఉద యం 6గంటలకే బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-04T11:01:06+05:30 IST