స్వామినగర్‌లో చోరీ

ABN , First Publish Date - 2020-12-06T06:00:57+05:30 IST

కాకినాడ రూరల్‌ మండలం స్వామినగర్‌లో శనివారం చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న మేడిద అప్పారావు నెల రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే రోజూ పనిమనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తోంది.

స్వామినగర్‌లో చోరీ

కాకినాడరూరల్‌, డిసెంబరు 5:  కాకినాడ రూరల్‌ మండలం స్వామినగర్‌లో శనివారం చోరీ జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న  మేడిద అప్పారావు నెల రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే రోజూ పనిమనిషి వచ్చి ఇంటిని శుభ్రం చేసి వెళ్తోంది. ఈ క్రమంలో శనివారం కూడా ఆమె ఇంటికి రాగా తలుపులు తీసి ఉండడాన్ని గమనించింది. ఈ విషయాన్ని అప్పారావు కుమార్తె స్వాతికి తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో సుమారు రూ.14,50,000 విలువచేసే బంగారం, వెండి చోరీకి గురయ్యాయని స్వాతి ఫిర్యాదులో పేర్కొంది. క్రైం, క్లూస్‌ టీం పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారని ఇంద్రపాలెం ఎస్‌ఐ నాగార్జునరాజు తెలిపారు. 

 


Read more