వాచ్‌మేన్‌ని బెదిరించి 10 కిలోల వెండి అపహరణ
ABN , First Publish Date - 2020-12-02T05:29:03+05:30 IST
ఇంటి వాచ్‌మేన్‌ను బెదిరించి 10 కిలోల వెండిని అపహరించుకుపోయారు. కాకినాడ రూరల్ వెంకటనగర్ విద్యాకాలనీలో ఓ ఇంటి వద్ద అంగర ప్రసాద్ నైట్ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు.
సర్పవరం జంక్షన్, డిసెంబరు 1: ఇంటి వాచ్‌మేన్‌ను బెదిరించి 10 కిలోల వెండిని అపహరించుకుపోయారు. కాకినాడ రూరల్ వెంకటనగర్ విద్యాకాలనీలో ఓ ఇంటి వద్ద అంగర ప్రసాద్ నైట్ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ముగ్గురు ఇనుపరాడ్లతో వచ్చి ప్రసాద్‌ను బెదిరించారు. అనంతరం ఇంటి మెయున్‌డోర్ పగలగొట్టి ఇంట్లో ఉన్న 10 కిలోల వెండి వస్తువులను అపహరించుకుపోయినట్టు ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. ఇన్‌చార్జి సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్టు సర్పవరం ఎస్‌ఐ ఎం.నరసింహారావు తెలిపారు. నిందితులు ముగ్గురు 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉంటుందని, హిందీలో మాట్లాడుతున్నారని వాచ్‌మేన్ తెలిపాడు.