మెడికల్‌ షాపులో చోరీ

ABN , First Publish Date - 2020-10-07T10:22:42+05:30 IST

మోరంపూడి సమీపంలో సాయి ప్రియాంక మెడికల్‌ షాపులో ఈనెల 4న అర్ధరాత్రి చోరీ జరిగిందని బొమ్మూరు పోలీసులు తెలిపారు...

మెడికల్‌ షాపులో చోరీ

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 6: మోరంపూడి సమీపంలో సాయి ప్రియాంక మెడికల్‌ షాపులో ఈనెల 4న అర్ధరాత్రి చోరీ జరిగిందని బొమ్మూరు పోలీసులు తెలిపారు. మానేపల్లి ఫణింద్ర మెడికల్‌ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఈనెల 4న రాత్రి 10:30 గంటలకు షాపు మూసివేసి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటిరోజు ఉద యం ఈ షాపు పక్కనే కూరగాయాలు అమ్ముకునే వ్యక్తి ఫణీంద్రకు ఫోను చేసి మెడికల్‌ షాపు తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పాడు. దీంతో షాపు వద్దకు వచ్చి చూస్తే కౌంటర్‌లో పెట్టిన రూ.38వేల నగదు, సీసీ కెమెరా హర్డ్‌డి స్క్‌, కంప్యూటర్‌ హర్డ్‌డిస్క్‌, డ్రింక్స్‌ తదితర వస్తువులు కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని బొమ్మూరు పోలీసులు తెలిపారు.

Read more