సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-10-03T06:46:04+05:30 IST

కరోనాను తరిమికొట్టేందుకు అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి

సేవలు అభినందనీయం

అనపర్తి, అక్టోబరు 2: కరోనాను తరిమికొట్టేందుకు అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అనపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగయ్యమ్మ కళావేదికపై  సీఐ భాస్కరరావు, వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎమ్‌లను ఎమ్మెల్యే సత్కరించారు. వైసీపీ నాయకులు నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, పడాల కళ్యాణ్‌రెడ్డి, ఎంపీడీవో వీణాదేవి, కార్యదర్శి విజయ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:46:04+05:30 IST