కోడి ధర కొండెక్కింది

ABN , First Publish Date - 2020-03-30T08:59:18+05:30 IST

కరోనా కారణంగా పడిపోయిన చికెన్‌ ధరలు లాక్‌డౌన్‌తో మళ్లీ పెరిగాయి. ఐదురోజులక్రితం కోడి ధర కిలో రూ.20 ఉంది.

కోడి ధర కొండెక్కింది

రూ.20నుంచి రూ.80కి చేరిన లైవ్‌ చికెన్‌

కిలో రూ.30నుంచి రూ.250కి చేరిన చికెన్‌ ధర 


మండపేట: కరోనా కారణంగా పడిపోయిన చికెన్‌ ధరలు లాక్‌డౌన్‌తో మళ్లీ పెరిగాయి. ఐదురోజులక్రితం కోడి ధర కిలో రూ.20 ఉంది. అకస్మాత్తుగా డిమాండ్‌ పెరిగి కోళ్లకోసం జనం ఎగబడుతున్నారు. దీంతో కోళ్ల ధర ఒక్కసారిగా పెంచేశారు. వారంరోజులక్రితం బ్రాయిలర్‌ కోడి మూడు కిలోలు రూ.100 అయినా కొనేవారు లేరు.


ప్రస్తుతం మాంసం, గుడ్లు, చేపలు తినాలని నిపుణులు చెప్తుండడంతో అపోహలు వీడి మాంసప్రియులు కోళ్లకోసం ఎగబడ్డారు. దీంతో బ్రాయిలర్‌ చికెన్‌ కిలో రూ.250కు చేరగా ఫారం కోడి రూ.80కి చేరింది. మార్కెట్‌లో మటన్‌ ధర కిలో రూ.700నుంచి రూ.800కు చేరడంతో సామాన్యులంతా బ్రాయిలర్‌, ఫారం కోడిమాంసం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Updated Date - 2020-03-30T08:59:18+05:30 IST