‘తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి’
ABN , First Publish Date - 2020-04-28T09:28:05+05:30 IST
అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

పిఠాపురం రూరల్, ఏప్రిల్ 27: అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. పిఠాపురం మండలం బి.కొత్తూరు, గోకివాడ, జములపల్లి గ్రామాల్లో వర్షపు నీటితో తడిసిన వరిపనలు, ధాన్యం రాశులను సోమవారం ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని, మంత్రి కన్నబాబు చొరవ తీసుకోవాలని సూచించారు.