ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-01T07:37:36+05:30 IST
2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్ట పర్చాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర
అధికార పార్టీకి ధీటుగా బీజేపీ బలోపేతం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ
కోరుకొండ, సెప్టెంబరు 30: 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్ట పర్చాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకాల గాంధీ పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ స్థాయి బీజేపీ నాయకుల సమావేశం బుధవారం కోరుకొండలో జరిగింది.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా ప్రత్యామ్నాయంగా బీజేపీని బలోపేతం చేయాలన్నారు. దీనిలో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోను సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 2024లో జరిగే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మండల, యువమోర్చా, కిసాన్, దళితమోర్చా కమిటీలను వేస్తున్నామని గాంధీ తెలిపారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. రాష్ట్ర నాయకుడు ఏపీఆర్ చౌదరి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విమనాశ్రయ అభివృద్ధి, జాతీయ రహదారుల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవస్థాగతమైన పనులు చేపట్టిందన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరం వయా కోరుకొండ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు కోడూరి లక్ష్మీనారాయణ, శివరామకృష్ణ, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల బీజేపీ మండలాధ్యక్షులు పేపకాయల కాశీ, నీలపాల వెంకన్న, కొండు వీర్రాజు నాయకులు పాల్గొన్నారు.