క్యాబ్‌ పేరుతో చోరీలు

ABN , First Publish Date - 2020-03-08T09:06:51+05:30 IST

కారు అద్దెకు తీసుకుని ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో ప్రయాణికులను ఎక్కించు కుని, జనసంచారం లేని ప్రాంతంలో దోపిడీ. క్యాబ్‌ పేరుతో చోరీలకు

క్యాబ్‌ పేరుతో చోరీలు

ప్రయాణికులను  ఆయుధాలతో బెదిరించి దోపీడీలు

పోలీసులు అదుపులో నలుగురు నిందితులు 


కాకినాడ,మార్చి (ఆంధ్రజ్యోతి) 7: కారు అద్దెకు తీసుకుని ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో ప్రయాణికులను ఎక్కించు కుని, జనసంచారం లేని ప్రాంతంలో దోపిడీ. క్యాబ్‌ పేరుతో చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువ కుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులంతా పాతికేళ్ల లోపువారే. కేసు వివరాలను శనివారం ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ ఆయన కార్యాలయంలో వెల్లడించా రు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వర్కర్స్‌ కాలనీ, పాలూరి వీధికి చెందిన ధనాల దుర్గారావు, గునుపూడి తెలగావీధికి చెందిన పూజాల వినయ్‌, వసంతల వారివీధికి చెందిన కొండేటి మణికంఠ శివకుమార్‌, రాజమహేంద్ర వరం జాంపేట ఖురేషి వీధికి చెందిన మహమ్మద్‌ ముతాహిర్‌ ఖురేషి ఇటీవల భీమవరంలో కారు అద్దెకు తీసుకుని  రాజమహేంద్రవరం మీదుగా వెళ్తూ వైజాగ్‌ వరకు కొందరి ప్రయాణికులను ఎక్కించుకున్నారు.


తుని రూరల్‌ పరిధిలో యర్రకోనేరు జాతీయరహదారి వద్ద కారు ఆపి వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. దీనిపై అందిన సమాచారం మేరకు తేటగంట సెంటర్‌లో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, అనంతరం చేసిన దర్యాపుల్లో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తుని రూరల్‌ సీఐ ఈ-చలానా యాప్‌, సీసీ కెమెరాల ఆధారంగా నేరంలో ఉపయోగించిన కారును గుర్తించినట్టు తెలిపారు.

Updated Date - 2020-03-08T09:06:51+05:30 IST