తమ్మయ్యపేటను తాకిన వరద
ABN , First Publish Date - 2020-09-20T10:21:34+05:30 IST
ఏలేరు వరద ఉధృతి అమరవల్లి శివారు తమ్మయ్యపేటను తాకింది. దీంతో గ్రామస్థులు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు మాదిరెడ్డి దొరబాబు,

అమరవల్లి (కొత్తపల్లి): ఏలేరు వరద ఉధృతి అమరవల్లి శివారు తమ్మయ్యపేటను తాకింది. దీంతో గ్రామస్థులు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక వైసీపీ నాయకుడు మాదిరెడ్డి దొరబాబు, కార్యకర్తలు శనివారం తమ్మయ్యపేట ఉప్పుటేరు కోతను పరిశీలించారు.
ఏలేరు వరద వల్ల తమ గ్రామం పూర్తిగా కోతకు గురవుతుందని ప్రజలు ఆవేదన చెందారు. ఇక ముందు తమ్మయ్యపేటకు ఎటువంటి కోత జరగకుండా శాశ్వత నివారణ పనులు చేపేట్టేందుకు ఎమ్మెల్యే దొరబాబు కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని దొరబాబు హామీ ఇచ్చారు. ఆయన వెంట సానా నాగు, చెలికానీ జగదీష్, పులి జయబాబు, గొరిసె కాపురెడ్డి, సతీష్ ఉన్నారు.