ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలి

ABN , First Publish Date - 2020-03-15T09:21:34+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. నిబంధనలు

ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలి

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

జిల్లా ఎన్నికల పరిశీలకుడు అరుణ్‌కుమార్‌


అమలాపురం రూరల్‌, మార్చి 14: 

స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు హెచ్‌.అరుణ్‌కుమార్‌ సూచించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలకు వరుస ఎన్నికలు జరగనున్న దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అమలాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం అరుణ్‌కుమార్‌ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రాజకీయపరమైన ఫ్లెక్సీలు, ఇతర బోర్డులను తొలగించే కార్యక్రమం పూర్తిచేశారా అని మండల పరిషత్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జల్లిపల్లి రంగలక్ష్మిదేవిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాలవద్ద చేపట్టనున్న ఏర్పాట్ల గురించి అసిస్టెంటు రిటర్నింగ్‌ అధికారి ఎం.ప్రభాకరరావును ఆయన ప్రశ్నించారు. పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మకమైనవి ఏమైనా ఉన్నాయా అని ప్రశించారు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు, కార్యదర్శులు జీఎస్‌.నారాయణరావు, రుద్రరాజు ఎస్‌ఎస్‌.సూరపరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-15T09:21:34+05:30 IST