చెత్తకు యూజర్‌ చార్జీలు చెల్లించిన కమిషనర్‌

ABN , First Publish Date - 2020-10-03T06:51:01+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో ప్రతి ఇంటి నుం చి తడి,పొడి చెత్త సేకరణలో ప్రజలను భాగస్వాములు చేస్తూ నగరపాలక

చెత్తకు యూజర్‌ చార్జీలు చెల్లించిన కమిషనర్‌

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 2: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో ప్రతి ఇంటి నుం చి తడి,పొడి చెత్త సేకరణలో ప్రజలను భాగస్వాములు చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ అభి షిక్త్‌ కిషోర్‌ తీసుకున్న యూజర్‌ చార్జీల నిర్ణయంలో తొలిఅడుగు పడింది. దానవాయిపేటలో తన నివాసంలో వేర్వేరుగా నిల్వ చేసిన తడిపొడి చెత్తను స్వయంగా కమిషనర్‌ తీసుకొచ్చి కార్పొరేషన్‌ పారిశుధ్య వాహనంలో వేసి యూజర్‌ చా ర్జీలు చెల్లించారు. చార్జీలు కట్టించుకనే ఈ పాస్‌ మిషన్ల పనితీరును పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి మంచి ర్యాంక్‌ తీసుకురావడానికి ప్రజలు కృషి చేయాలని ఆయన కోరారు.


కార్మికులకు కరువు భత్యం రూ.10 వేలివ్వాలి 

రాజమహేంద్రవరం సిటీ: కార్మికులకు కరువు భత్యం రూ.10 వేలు ఇవ్వాలని ఎంపీ భరత్‌ రామ్‌కు శుక్రవారం ఏపీ బిల్డింగ్‌ కనెస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ వినతిపత్రం అందజేసింది. భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నుంచి ప్రభుత్వాలు ఉపయోగించుకున్న రూ.710 కోట్లు తిరిగి బోర్డులో జమ చేయాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో నాయకులు పందెళ్ళ భాను ప్రసాద్‌, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ బెట్టి చిట్టిబాబు, సీత మురళీకృష్ణ, యర్రా సత్యనారాయణ, చంద్రరావు రాంబాబు, పర్తి శ్రీను, ఎస్‌కె వల్లీ, ఎం రమణ, గంటా తదితరులున్నారు. 

Updated Date - 2020-10-03T06:51:01+05:30 IST