రైతు భరోసా కేంద్రం సందర్శించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-02-12T08:59:18+05:30 IST

ప్రతి రైతుకు రానున్న ఖరీఫ్‌నుంచి సమగ్ర వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు సేవలందించేలా కృషి చేయాలని

రైతు భరోసా కేంద్రం సందర్శించిన కలెక్టర్‌

సామర్లకోట, ఫిబ్రవరి 11: ప్రతి రైతుకు రానున్న ఖరీఫ్‌నుంచి సమగ్ర వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు సేవలందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో రైతుభరోసా కేంద్రం ఏర్పాటుపై జిల్లా కలెక్టరు మురళీధర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్‌, డీడీ వీటీ రామారావు, ఏడీ జీవీ పద్మశ్రీ, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ నాగరాజులతో కలిసి మంగళవారం సందర్శించారు. మొదటి దఫాలో జిల్లావ్యాప్తంగా 310 రైతు భరోసా కేంద్రాలు ఎంపిక చేయగా 138 కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఈనెల 20 నాటికి ప్రారంభిస్తామని జేడీ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిటల్‌ కియోస్కి ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా స్టాక్‌ పాయింట్లుగా ఐదు హబ్‌లను నడకుదురు, ద్రాక్షారామ, రావులపాలెం, రాజమహేంద్రవరం, తునిల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామన్నారు. ఏడీ జీవీ పద్మశ్రీ, ఏవో ఐ.సత్య, ఈవోపీఆర్‌డీ కేవీ సూర్యనారాయణ, ప్రత్యేకాధికారి భాస్కర రమేష్‌, ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈవో ఎంవీ సతీష్‌, సొసైటీ అధ్యక్షులు వీరంరెడ్డి వెంకయ్య,వీరంరెడ్డి వసంతరాయుడు, వీరంరెడ్డి చినబాబు, పంచాయతీ కార్యదర్శి డి.సూర్యనారాయణరెడ్డి, వీఏఏలు రామక్రిష్ణ, పేపకాయల వంశీ, నవాజ్‌ పాల్గొన్నారు

Updated Date - 2020-02-12T08:59:18+05:30 IST