స్వీపర్లపై దాడిచేసిన వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2020-10-07T09:06:00+05:30 IST

చల్లపల్లి పంచాయతీ స్వీపర్లపై దాడి చేసిన వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు...

స్వీపర్లపై దాడిచేసిన వ్యక్తిపై కేసు

ఉప్పలగుప్తం, అక్టోబరు 6: చల్లపల్లి పంచాయతీ స్వీపర్లపై దాడి చేసిన వ్యక్తిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మట్టలచెరువుకు చెందిన చీకురుమెల్లి రాజశేఖర్‌ ఈనెల నాలుగో  తేదీ రాత్రి పంచాయతీ స్వీపర్‌ భార్య నక్కా దుర్గ వంక పదేపదే చూడటంతో భర్త నాగన్న నిలదీశాడు. దీంతో రాజశేఖర్‌ నాగన్నపై దాడి చేస్తుండగా దుర్గ అడ్డువెళ్లింది. ఆమెపై కూడా రాజశేఖర్‌ చేయి చేసుకున్నాడు. దుర్గ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.సురేష్‌బాబు తెలిపారు.

Read more