కాకినాడలో జబర్దస్త్‌ నటుల సందడి

ABN , First Publish Date - 2020-02-08T08:03:49+05:30 IST

కాకినాడ రూరల్‌ సర్పవరంజంక్షన్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ఎంటీ షాపింగ్‌మాల్‌లో జబర్దస్త్‌

కాకినాడలో జబర్దస్త్‌ నటుల సందడి

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), ఫిబ్రవరి 7: కాకినాడ రూరల్‌ సర్పవరంజంక్షన్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ఎంటీ షాపింగ్‌మాల్‌లో జబర్దస్త్‌ నటులు అవినాష్‌, కార్తీక్‌ సందడి చేశారు. శుక్రవారం మాల్‌లోని బార్బెక్యూ నేషన్‌ రెస్టారెంట్‌ రీజినల్‌మేనేజర్‌ మన్సూర్‌ మెమెన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో పరివర్తన చెందిన సుమారు 50మంది అనాథ బాలురకు ఆ రెస్టారెంట్‌లో ఆహారం పంపిణీ చేశారు. అనంతరం బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్‌, కార్తీక్‌ మాట్లాడుతూ కాకినాడ రావడం ఆనందంగా ఉందని, రెస్టారెంట్‌లో రుచికరమైన ఆహారం తీసుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందన్నారు. అనంతరం వారు చేసిన మిమిక్రీ సందర్శకులను ఆకట్టుకుంది. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న కాకినాడలో రెస్టారెంట్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆర్‌ఎం మన్సూర్‌ మెమెన్‌ చెప్పారు. ఇప్పటికే నెల్లూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హోప్‌ ఫర్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ సభ్యులు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T08:03:49+05:30 IST