బయో మెడికల్‌ వేస్ట్‌ ప్లాంటు మాకొద్దు

ABN , First Publish Date - 2020-09-01T08:15:58+05:30 IST

మర్రిపూడి గ్రామానికి చెందిన సర్వే నెంబరు 258లో నిర్మించనున్న బయో మెడికల్‌ వేస్ట్‌ ప్లాంటు వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు తూట్లు పడతాయని, ఈ ప్లాంటు మాకొద్దం

బయో మెడికల్‌ వేస్ట్‌ ప్లాంటు మాకొద్దు

ప్రజాభిప్రాయ సేకరణలో ఎనిమిది గ్రామాల ప్రజల వినతి


రంగంపేట, ఆగస్టు 31: మర్రిపూడి గ్రామానికి చెందిన సర్వే నెంబరు 258లో నిర్మించనున్న బయో మెడికల్‌ వేస్ట్‌ ప్లాంటు వల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు తూట్లు పడతాయని, ఈ ప్లాంటు మాకొద్దంటూ సుమారు 8 గ్రామాల ప్రజలు నినదించారు. మర్రిపూడి ఉన్నత పాఠశాల ఆవరణలో పెద్దాపురం ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.


ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టరును ఆదేశించాలంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందన్నారు. దీంతో కోర్టు నాలుగు వారాల సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి తమకు నివేదించాలని సూచించిందన్నారు. మర్రిపూడి, చినబ్రహ్మదేవం, సింగంపల్లి, ఆర్బీపట్నం, ఆర్బీ కొత్తూరు, కొండపల్లి, గోలివారి కొత్తూరు గ్రామాలకు చెందిన ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.








































గ్రామాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో వారి గ్రామాల నుంచి తీసుకువచ్చిన వినతి పత్రాలను అధికారులకు అందిం చారు. 2017లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించిన ఫ్యాక్టరీకి ప్రస్తుతం ఎలా అనుమతులు మంజూరయ్యాయంటూ కాలుష్య నివారణ మండలి ప్రతినిధులను ప్రశ్నించారు. వైసీపీ నాయకులు నల్లా శ్రీనివాసరావు, పి.రామచంద్రరావు, కె. ఇజ్రా యిల్‌, లంక చంద్రన్న, చిరంజీవి, ఆర్‌.వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు ఆళ్ల గోవిందు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తహశీల్దార్‌ వై.జయ, సీఐ కేఎన్వీ జయకుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-09-01T08:15:58+05:30 IST