తెలంగాణ నుంచి వలస కార్మికుల రాక

ABN , First Publish Date - 2020-05-08T09:26:17+05:30 IST

మండలంలోని కొడవల్లికి చెందిన 18 మంది వలస కార్మికులు గురువారం స్వగ్రామానికి చేరుకున్నారు.

తెలంగాణ నుంచి వలస కార్మికుల రాక

 గొల్లప్రోలు రూరల్‌, మే 7: మండలంలోని కొడవల్లికి చెందిన 18 మంది వలస కార్మికులు గురువారం స్వగ్రామానికి చేరుకున్నారు. వీరు హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లలో వాచ్‌మన్‌, ఇతర పనుల్లో ఉన్నారు. వీరందరినీ తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రానికి తరలించినట్టు తహసీల్దారు సీత తెలిపారు. చేబ్రోలు ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో తాత్కాలిక క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు తహసీల్దారు, ఎంపీడీవో హరిప్రియలు పరిశీలన జరిపారు.

Updated Date - 2020-05-08T09:26:17+05:30 IST