‘హత్రాస్‌ ఘటనలో... నిందితులను ఉరి తీయాలి’

ABN , First Publish Date - 2020-10-03T06:49:36+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో దళిత యువతిని హత్యచారం చేసిన నిందితులను ఉరి తీయాలని దళిత నేతలు

‘హత్రాస్‌ ఘటనలో... నిందితులను ఉరి తీయాలి’

రాజమహేంద్రవరం సిటీ/ గోదావరి సిటీ, అక్టోబరు 2: ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ జిల్లాలో దళిత యువతిని హత్యచారం చేసిన నిందితులను ఉరి తీయాలని దళిత నేతలు డీఎంఆర్‌ శేఖర్‌, మర్రి బాబ్జి, కాశి నవీన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గోకవరం బస్టాండ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి దళిత గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. విచారణ జరిపి నెల రోజుల్లోనే దోషులకు ఉరిశిక్ష విధించాలన్నారు. పీసీసీ కార్యదర్శి ముళ్ళ మాధవ్‌ ఆధ్వర్యంలో కంబాల చెరువు వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో మూల్‌ నివాసి కర్మచారి సంఘం జాతీయ కార్యదర్శి కెతిలక్‌కుమార్‌, బీఎ్‌సఐ నాయకులు సీహెచ్‌ సుబ్బారావు, కొంకి రేమష్‌, తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్‌, యస్‌ గన్నెయ్య, పిసురేష్‌, వరదా నాగేశ్వరరావు, కెమురళీకృష్ణ, చింతా అనిల్‌ బాబు, కెరత్నబాబు, దువ్వాడ రాజా పాల్గొన్నారు.


కఠినంగా శిక్షించాలి

రంపచోడవరం: ఉత్తరప్రదేశ్‌లో గౌన్సారీ గ్రామా నికి చెందిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు బి.శ్రీదేవి డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దిశ, నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేసి మహిళలకు భద్రత కల్పించాలన్నారు.

Updated Date - 2020-10-03T06:49:36+05:30 IST