రేపటి నుంచి జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్ పోటీలు
ABN , First Publish Date - 2020-12-11T06:11:24+05:30 IST
రాజమహేంద్రవరంలో ఈనెల 12,13 తేదీలలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్ సెలెక్షన్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మరుకుర్తి దుర్గాయాదవ్ తెలిపారు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 10: రాజమహేంద్రవరంలో ఈనెల 12,13 తేదీలలో స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి థాయ్‌బాక్సింగ్ సెలెక్షన్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు మరుకుర్తి దుర్గాయాదవ్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, సీనియర్ కోచ్ శామ్యూల్ రాజులు మాట్లాడారు. 12న సాయంత్రం ఈ పోటీలు ప్రారంభమవుతాయని దీనికి ముఖ్యఅతిథులుగా కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, వైసీపీ నగర కోఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం, యువజననేత జక్కంపూడి గణేష్, నగర ప్రముఖులు పంతం కొండలరావు, పట్టపగల వెంకట్రావులు హాజరవుతారని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని యాదవ్ తెలిపారు. ఇక్కడ విజేతలైన వారిని ఈనెల 27న విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి థాయ్‌బాక్సింగ్ పోటీలకు ఎంపిక చేసి పంపిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహక కమిటీ కార్యదర్శులు భవానీ శంకర్, మర్రి పుష్పరాజ్ బొంతు మధుకుమార్‌లు పాల్గొన్నారు.