దేవదాయ శాఖ డీసీగా విజయరాజు

ABN , First Publish Date - 2020-11-07T05:56:26+05:30 IST

జిల్లా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఎం.విజయరాజు శుక్రవారం కాకినాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. దేవదాయశాఖ కమిషన కార్యాలయంలో ఏసీ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన డీసీగా బాధ్యతలు స్వీకరించారు.

దేవదాయ శాఖ డీసీగా విజయరాజు

భానుగుడి (కాకినాడ), నవంబరు 6: జిల్లా దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఎం.విజయరాజు శుక్రవారం కాకినాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. దేవదాయశాఖ కమిషన కార్యాలయంలో ఏసీ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన డీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ పనిచేసిన బీవీఎస్‌ దుర్గాప్రసాద్‌ కమిషనర్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయనను దేవదాయశాఖ ఈవోలు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. విజయరాజు గతంలో కృష్ణాజిల్లా పెనుగ్రంచిప్రోలు ఆలయంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో పలు దేవాలయాల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.


Updated Date - 2020-11-07T05:56:26+05:30 IST