38.2 అడుగుల ఎత్తుతో నూతన రథం

ABN , First Publish Date - 2020-09-12T10:32:54+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన వాహనమైన రథం ఇటీవల అగ్నికి ఆహుతి అవడంతో నూతన రఽథాన్ని నిర్మించేందుకు

38.2 అడుగుల ఎత్తుతో నూతన రథం

ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ


అంతర్వేది, సెప్టెంబరు 11: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన వాహనమైన రథం ఇటీవల అగ్నికి ఆహుతి అవడంతో నూతన రథాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. 38.2 అడుగుల ఎత్తు, 12.10 అడుగుల వెడల్పు, చక్రాల పైభాగాన 20.6 అడుగుల పొడవుతో ఈ నమూనాను సిద్ధం చేస్తున్నట్టు ఈఈ చంద్రశేఖర్‌ తెలిపారు. ఏడీపీ రామచంద్రమోహన్‌ ఆధ్వర్యంలో వివిధ కమిటీలను ఏర్పాటుచేసి స్వామివారి రథానికి సంబంధించిన నాణ్య మైన చెక్కను అన్వేషిస్తున్నారు. అలాగే స్వామివారి కలాణోత్సవాల్లో జరిగే మహోత్తర ఘట్టమైన ఈ రథోత్సవంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రథాన్ని సిద్ధం చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. షెడ్డు నిర్మాణంలోనూ మార్పులు ఉంటాయన్నారు. 

Updated Date - 2020-09-12T10:32:54+05:30 IST