తెలుగు కవిత్వంలో గురజాడది ప్రత్యేక ముద్ర

ABN , First Publish Date - 2020-12-01T07:06:43+05:30 IST

ఆధునిక తెలుగు సాహిత్యంలో గుర జాడ కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ కవి నల్లా నరసిం హమూర్తి పేర్కొన్నారు.

తెలుగు కవిత్వంలో గురజాడది ప్రత్యేక ముద్ర

అమలాపురం టౌన్‌, నవంబరు 30: ఆధునిక తెలుగు సాహిత్యంలో గుర జాడ కవిత్వానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ కవి నల్లా నరసిం హమూర్తి పేర్కొన్నారు. అమలాపురం తెలుగుమాట, నానీల వేదిక సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జేఎస్‌ఎం జూనియర్‌ కళాశాలలో మహా కవి గురజాడ వర్ధంతి సభ నిర్వహించారు. సాహితీ రంగంలో గురజాడ అనుసరించిన పోకడలు ఎందరికో ఆదర్శమని అధ్యక్షతన వహించిన సాహితీవేత్త పచ్చిమాల శివనాగరాజు పేర్కొన్నారు. గురజాడ చిత్రపటానికి పలువురు పూలమాలలువేసి నివాళులర్పించారు.  కవులు బీవీవీ.సత్యనారా యణ, డాక్టర్‌ జె.నెహ్రునాయక్‌, ఆకొండి కృష్ణశాస్ర్తి, పుత్సా కృష్ణకామేశ్వర్‌, ధోనిపాటి వెంకటేశ్వరరావు, యెరుబండి వెంకరమణమూర్తి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T07:06:43+05:30 IST