జనవరి 18న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటరు జాబితా ప్రచురణ

ABN , First Publish Date - 2020-12-27T07:35:48+05:30 IST

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితాను వచ్చే నెల 18న ప్రచురిస్తామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు.

జనవరి 18న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తుది ఓటరు జాబితా ప్రచురణ

కాకినాడ,డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి ఓటరు తుది జాబితాను వచ్చే నెల 18న ప్రచురిస్తామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఇప్పటివరకు దీనికి సంబంధించి చేపట్టిన కార్యాచరణను ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 1న ముసాయిదా జాబితా ప్రచురించామన్నారు. క్లైయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖారు వరకు గడువు ఇచ్చామన్నారు. వచ్చే నెల 12న వీటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. అదేరోజున అను బంధాలను తయారు చేసి ముద్రిస్తామన్నారు. జాబితాలో లేని అర్హులైన ఉపాధ్యాయులు, లెక్చరర్‌లు ఈ నెల 31లోగా అన్ని తహసీల్దార్‌/ఎంపీడీవో/ మునిసిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం కోసం టోల్‌ ప్రీ నంబరు 1950లో సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-12-27T07:35:48+05:30 IST