ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2020-10-01T07:56:22+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉభయ

ఉపాధ్యాయుల బదిలీ  ఉత్తర్వులు విడుదల చేయాలి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌


రాజానగరం, సెప్టెంబరు 30: ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల ఎస్టీయూ నాయకుల సమావేశం బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు జోసఫ్‌ సుధీర్‌బాబు అధ్యక్షతన  రాజానగరంలో జరిగింది. నరసింహారెడ్డి మాట్లాడుతూ సీపీఎ్‌సను రద్దు చేసి, ఓపీఎ్‌సను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని సుఽధీర్‌బాబు కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఉద్యోగలకు పేరివిజన్‌ను వెంటనే అమలు చేయాలని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రఘునాధరెడ్డి డిమాండ్‌ చేశారు.


సమావేశంలో సంఘ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధ్యక్షులు డి.వెంకట్రావు, కె.రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శులు ఎం.శివ ప్రసాద్‌, సీపీఎల్‌ నారాయణ, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ పి.సుబ్బరాజు, రాష్ట్ర నాయకులు పి.దొరబాబు, కేవిశేఖర్‌, ఎల్‌సాయి ప్రతాప్‌, ఉమాపతి శాస్త్రి, ఎస్‌జే త్రినాధ్‌బాబు, జి.జ్యోతి, ఆగమనరావు, పవన్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:56:22+05:30 IST