‘కూడు, గూడు కల్పించింది టీడీపీనే’

ABN , First Publish Date - 2020-07-08T21:14:58+05:30 IST

ప్రతీ పేదవాడికి కూడు, గూడు కల్పించిన ఘనత టీడీపీకి ..

‘కూడు, గూడు కల్పించింది టీడీపీనే’

రాయవరం(తూర్పు గోదావరి): ప్రతీ పేదవాడికి కూడు, గూడు కల్పించిన ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి (కూర్మాపురం అబ్బు) పేర్కొన్నారు. మంగళవారం ఆయన కూర్మాపురంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాశ్వత గృహనిర్మాణ పథకం ప్రవేశపెట్టి టీడీపీ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇళ్ల స్థలాల కొనుగోలుకు విడుదల చేసిన రూ.8వేల కోట్లలో భారీ అవినీతి జరిగిందన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లు పేదలకు స్వాధీనం చేయకుండా పెండింగ్‌ బిల్లులను లబ్ధిదారులకు చెల్లించలేదన్నారు. వాటిని వెంటనే చెల్లించడంతో పాటు నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-08T21:14:58+05:30 IST