-
-
Home » Andhra Pradesh » East Godavari » tdp leaders ycp
-
‘‘వైసీపీ ముఖ్యనేతల అండదండలతో కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు’’
ABN , First Publish Date - 2020-12-10T06:44:59+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ముఖ్యనేతల అండదండలతో కార్యకర్తలు పేట్రేగిపోతున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.

రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలు
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు : చినరాజప్ప
మండపంలో వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నాయకులు
శంఖవరం, డిసెంబరు 9: రాష్ట్రంలో వైసీపీ ముఖ్యనేతల అండదండలతో కార్యకర్తలు పేట్రేగిపోతున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మం డలంలోని మండపం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ కార్యకర్త ఉటుకూరి వీరబాబు కుటుంబాన్ని బుధవారం టీడీపీ నేత లు పరామర్శించారు. వీరబాబు భార్యా పిల్లలను ఓదార్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకర్ల సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి అండదండలతోనే వైసీపీ కార్యకర్తలు టీడీపీపై మారణ హోమం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తుని నియోజకవర్గంలో వైసీపీ ముఖ్యనేత తమ కార్యకర్తలను టీడీపీపై ఉసిగొలుప్పతున్నాడన్నారు. వీరబాబును హత్యచేసిన నిందితుల కాల్ రికార్డులను పరిశీలిస్తే నిజం నిగ్గు తేలుతుందని, అసలు నిందితులు బయటపడతారన్నారు. వీరబాబు కుటుంబానికి అండగా ఉండి వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని, నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఉపేక్షించబోమని రాజప్ప హెచ్చరించారు. కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కాకినాడ మేయర్ సుంకరపావని, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లాప్రధానకార్యదర్శి పిల్లి సత్తిబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరపుల రాజా, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కొమ్ముల కన్నబాబు, నాయకులు వెన్నా ఈశ్వరుడు, కీర్తి సుభాష్, బచ్చల గంగ, పోలం చిన్న, పాల్గొన్నారు.