సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు

ABN , First Publish Date - 2020-10-27T06:16:49+05:30 IST

టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు తన పుట్టిన రోజు సందర్భంగా సొంత నిఽధులతో పూర్తిగా శిథిలమైన లాలాచెరువు- క్వారీసెంటర్‌ రోడ్డుకు మరమ్మతులు చేయించారు.

సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు
సొంత నిధులతో రోడ్డు మర్మత్తులను స్వయంగా చేస్తున్న ఆదిరెడ్డి వాసు

  • -ఏబీసీ సెంటర్‌కు డాగ్‌ అంబులెన్సు బహూకరణ
  • పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 26: టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు తన పుట్టిన రోజు సందర్భంగా సొంత నిఽధులతో పూర్తిగా శిథిలమైన లాలాచెరువు- క్వారీసెంటర్‌ రోడ్డుకు మరమ్మతులు చేయించారు. సోమవారం తానే స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు మరమ్మతు చేశారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ తన పుట్టినరోజు నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ రోడ్డుకు సొంత నిధులతో మరమ్మతులు చేయించిన ఆదిరెడ్డి వాసుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డివాసు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఏబీసీ సెంటర్‌కు డాగ్‌ అంబులెన్సును బహుకరించారు. టీడీపీ నాయకులు ఇన్నమూ రి దీపు, రవి యాదవ్‌, ఉప్పులూరి జానకి రామయ్య, కుటుంబరావు, కవులూరి వెంకటరావు, బెనర్జి, నాని, చిన్నిరాజు, కృపామణి, నల్లం ఆనంద్‌ వాసుకు శుభాకాంక్షలు తెలిపారు.

  • క్వారీమార్కెట్‌ సెంటర్లో పేదలకు అన్నదానం

రాజమహేంద్రవరం అర్బన్‌: టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు పుట్టినరోజును పురస్కరించుకుని క్వారీమార్కెట్‌ సెంట ర్‌ అన్న క్యాంటీన్‌వద్ద పార్టీ శ్రేణులు సోమవారం పేదలకు భారీ అన్నదానం నిర్వహించారు. 47వ డివిజన్‌ టీడీపీ నాయకుడు బేసరి చిన్ని ఆధ్వర్యంలో 1500మంది పేదలకు అన్నదానం చేశారు. పార్టీ నాయకులు కొయ్యల రమణ, అగురు ధనరాజ్‌, రవియాదవ్‌,డివిజన్‌ కమిటీ సభ్యులు మేడికొండ అప్పా రావు, గుంట రాము, సంబారి పవన్‌, సూరిశెట్టి శ్రీను, సురేష్‌, అప్పలకొండ, ఆదిరెడ్డి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:16:49+05:30 IST