అవినీతిపై పోరాటం... సామాన్యులకు అండ

ABN , First Publish Date - 2020-11-06T06:17:36+05:30 IST

టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు తక్షణం ఇవ్వా లని, వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అర్హులందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టడానికి టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

అవినీతిపై పోరాటం... సామాన్యులకు అండ
అసెంబ్లీ ఇనచార్జిలతో సమావేశమైన టీడీపీ కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన

  • ఇళ్ల స్థలాల సమస్యపై నిరసన తెలిపేందుకు టీడీపీ ప్రణాళిక 
  • నేటి నుంచి మూడు రోజుల పాటు కార్యాచరణ

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 5: టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు తక్షణం ఇవ్వా లని, వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అర్హులందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టడానికి టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇళ్ల స్థలాల కుంభకోణం, అవినీతిపై పోరాటాలు చేస్తామని, సామాన్యులకు అండగా ఉంటామని చెప్పారు. జాతీయ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణను ప్రకటించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, యనమల కృష్ణుడు, వరపుల రాజా పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పావని  మాట్లాడుతూ ప్రతీ పేదవానికీ ఇంటి స్థలం ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం వివాదాలు లేని భూమిని తక్షణం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి టీడీపీ అడ్డుపడుతోందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం గ్రామ/వార్డు లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిరసనలో భాగస్వాములు చేస్తామన్నారు. 7వ తేదీ శనివారం ఇళ్ల స్థలాల వద్ద నిరసన ప్రదర్శనలు జరుపుతామని, 8వ తేదీన ప్రజా సమస్యలపై మీడియా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. 

Updated Date - 2020-11-06T06:17:36+05:30 IST