దళిత యువతి హత్యకు నిరసనగా..

ABN , First Publish Date - 2020-12-27T07:37:23+05:30 IST

అనంతపురం జిల్లా బడన్నపల్లి పొలాల్లో హత్యకు గురైన దళిత మహిళ స్నేహలత ఉదంతంపై నిరసన తెలుపుతూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

దళిత యువతి హత్యకు నిరసనగా..
ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు 26: అనంతపురం జిల్లా బడన్నపల్లి పొలాల్లో హత్యకు గురైన దళిత మహిళ స్నేహలత ఉదంతంపై నిరసన తెలుపుతూ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కాకినాడ పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని నాయకత్వంలో కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం వ ంతెన అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జగన్‌రెడ్డి రాక్షస పాలనలో మన ఆడబిడ్డలకేది రక్షణ అని రాసిన ప్లేకార్డ్‌లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బండి సత్యనారాయణ, బంగారు సూర్యావతి, తహేరా ఖాతూన్‌, పేరాబత్తుల లోవబాబు, పలివెల గాయత్రి రూరల్‌ మహిళా అధ్యక్షురాలు గుత్తుల వెంకటలక్ష్మి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం మణికంఠ, ఐద్వా మహిళా నాయకురాలు రమణి, జ్యోతి, పలువురు యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T07:37:23+05:30 IST