పార్టీ బలోపేతానికి చర్యలు
ABN , First Publish Date - 2020-12-13T06:16:23+05:30 IST
అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల లో పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని టీడీపీ అరకు పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి పిలుపునిచ్చారు

మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి
రంపచోడవరం, డిసెంబరు 12: అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల లో పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని టీడీపీ అరకు పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం పార్టీ ఆధినేత నారా చంద్రబాబు అరకు పార్లమెంట్ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పోలవరం నిర్వాసిత సమస్యలు, ఇసుక దందా తదితర సమస్యలపై చంద్రబాబుకు వివరించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షు డు అడబాల బాపిరాజు, పాటోజు సురేష్, సలాది బాపిరాజు, పి.సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.