-
-
Home » Andhra Pradesh » East Godavari » Talent of Aditya students in this set
-
ఈసెట్‌లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2020-10-07T09:30:28+05:30 IST
ఏపీ ఈసెట్ ఫలితాల్లో సూరంపాలెం ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి మంగళవారం తెలిపారు...

గండేపల్లి, అక్టోబరు 6: ఏపీ ఈసెట్ ఫలితాల్లో సూరంపాలెం ఆదిత్య విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జి.లక్ష్మణ్ (4 ర్యాంకు), జి.శ్రీరామ్ (4వ ర్యాంకు), వీఎస్‌ఎల్‌ఎం ప్రదీప్ (8వ ర్యాంకు) సాధించారన్నారు. తమ విద్యార్థులు పది లోపు 4 ర్యాంకులు, వంద లోపు 25 ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయనతోపాటు ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్‌టీఎస్‌వీ కుమార్, క్యాంప్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, డీన్ మాధవరావు తదితరులు అభినందించారు.
నాగజ్యోతికి ఐదో ర్యాంకు
గోకవరం, అక్టోబరు 6: ఈసెట్ ఫలితాల్లో ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థిని చామర్తి కుసుమ నాగజ్యోతి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించినట్టు కళాశాల చైర్మన్ పి.కనకరాజు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి పి.నాగమణి మాట్లాడుతూ వంద లోపు 5, 28, 66, 95, 200లోపు వరుసగా 112, 128, 128, 136, 141, 172 ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. కళాశాల కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, ఏవో టి.శివరామకృష్ణ, అధ్యాపక బృందం నాగజ్యోతిని అభినందించింది.
బులిరాజుకు 137వ ర్యాంకు
సామర్లకోట, అక్టోబరు 6: ఈసెట్ ఫలితాల్లో సామర్లకోట మండలం వేట్లపాలేనికి చెందిన కురికూరి బులిరాజు రాష్ట్రస్థాయిలో 137వ ర్యాంకు సాధించాడు. బులిరాజు వేట్లపాలెం రామకృష్ణ సేవాసమితి ఉపాధ్యాయుల వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ఈ సంర్భంగా బులిరాజును మంగళవారం సాయంత్రం పలువురు అభినందించారు.