కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-03T06:17:11+05:30 IST

కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాను ప్రభుత్వం ఆదుకోవాలని తుని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా

కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

తుని, అక్టోబరు 2: కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాను  ప్రభుత్వం ఆదుకోవాలని తుని ప్రెస్‌క్లబ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక గాంధీ సత్రం వద్ద గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించి, వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు పి.రాంబాబు, ప్రభాకర్‌ మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన జర్నలిస్టుల ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు అందించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలెన్నో రోడ్డున పడ్డారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో పసుపులేటి శ్రీధర్‌, దేవవరపు కృష్ణార్జునరావు, పొలమరశెట్టి మధు, తమరాన రామకృష్ణ, కెళ్ల శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:17:11+05:30 IST